Image credit: Frida Maureen Hultberg

View Artwork Credits
View full size

When Jhamli woke from her nap, she remembered she hadn’t cleaned the dung from the cattle shed since morning. Her people had gone to the fair in a nearby village. She wanted to finish cleaning before they returned. She walked slowly to the shed, entered and sat on a stone by the water trough, inspecting the dung. The outside was already dry. The hens seemed to have scraped dark lines across it as they looked for a morsels to feed on. A few insects crawled over it already.

 

The dried grass in the shed was soaked in buffalo urine and smelled like semen. Multicolored spiders hung under the corners of the tin roof. Jhamli imagined they were colorful bead necklaces. Leaves and fruits from the neem tree were strewn across the ground outside their hut.

 

Deciding to quickly finish her task, Jhamli tied her phetya above her waist, wrapped her tookri around her braids, and began to clean the shed.  When she was done, she’d make roti with rice bran and cook some dal with rela flowers for the next meal.

 

As she lifted the cow dung in the shed, she felt sick. Cleaning her hands on dried grass, she came out of the shed, and sat on the cot under a tree canopy in the front porch. Jhamli stopped her neighbor Pikni as she passed by.

 

“Is something wrong, Jhamli?” Pikni asked.

 

“My belly hurts, and I feel dizzy. I think it is time for the baby to arrive, Bai,” Jhamli replied, visibly tired.

 

“Lie down on the cot. I’ll be right back!” Pikni left to find women friends to help.

 

None of the elders or men were in the tanda. They were all at the fair. Some of the women who’d remained at home heard Pikni’s call and arrived at Jhamli’s doorstep.

 

Jhamli held her stomach with one hand.

 

“Oh mother, oh sister. I am dying, dear sisters. Save me from this pain.” She began to cry. The women placed Jhamli’s cot under the neem tree, gathered close beside her, consoled her, assured her the delivery would go smoothly and asked her to be patient.

 

The sun, reluctant to fully drop down into the hills, shone like a red banyan fruit. The women had expected the men back by then, but not one had yet returned. Cattle, buffalo, oxen, sheep, and goats, all the farm animals returned from grazing in the forest. The women tied the animals in their respective sheds and returned to the cot. Hearing the cries of Jhamli’s animals from the neighboring shed, Pikni tied them too and returned.

 

Darkness crept slowly into the village like an army of black ants. Jhamli’s wails increased with her pain. Pikni suggested some country liquor might calm her. Someone in the group brought a small cup that Pikni gave to Jhamli. This soothed her, but only for a few moments.

 

Jhamli was sixteen years old.  Her pregnant stomach appeared heavier than a calf. Everyone believed she carried twins. Jhamli’s screams of pain caused the other women to wail.

 

One of the women collected strands of hair from the others, wove an amulet, and tied it around Jhamli’s left ankle.

 

 “You will have a healthy child. Have you heard of our traditional birthing practice? Let me describe it to distract you from your pain. I witnessed it in my youth,” she said. Jhamli became interested, despite the pain, and so did the other women around her. The woman sat close to Jhamli and told the story of Hingla.

 

***

 

Hingla looked like a doll with her fair complexion, honey-colored eyes, and golden hair. By the time this story begins, she already had lost three pregnancies. During her first, she’d gone to pick ippa flowers and stepped on a peacock’s eggs. While she carried her second, her husband returned from hunting with a pregnant rabbit. They cooked it and ate it and threw its unborn babies away. During her third pregnancy, an iguana entered their house. According to tradition, if an iguana enters the house, we must catch it, tie its legs with its own tail, put it in a pot covered with a white or red cloth, and then bury the pot near the front entrance to the house. Our folks believe that stepping over this pot every day will bring prosperity. But Hingla asked to eat the iguana’s meat instead. And so the third pregnancy was lost.

 

Hingla remained childless for two more years. One rainy day, she dreamt a deer came to her and said, “I am dying. My child is hungry and tired and is now among your goats. Take care of her.” Suddenly, the deer turned into a tree with branches shaped like antlers, and Hingla woke with a start. She went with her husband to check on their goats. They found a fawn, tired and famished, tucked in a corner among the goats. Hingla brought the fawn to a mother goat. But the goat kicked the fawn away. Resolute, Hingla brought the fawn inside and asked her husband to sleep on the floor. He agreed. Hingla brought the fawn into their bed and sang a lullaby. She offered her breast, and the fawn drank throughout the night while Hingla dozed.

 

When she woke early the next morning, a pale yellow fluid dripped from her breasts. But the fawn was gone. She asked her husband if he’d seen it.

 

“Were you dreaming?” he asked.

 

The question surprised her. Was it all a dream? She had no idea.

 

She searched for the fawn and asked her neighbor if she’d seen it.

 

“Nature called, and I woke up last night. I saw a fox roaming the tanda,” the neighbor replied.

 

 “Perhaps the fox took the fawn,” Hingla thought. The incident saddened her, but she was pregnant within the month. Everyone thought this pregnancy too would end in miscarriage. That was not to be. Her labor pains began one day into her seventh month of pregnancy. Two days later, everyone followed the local midwife’s advice to do a traditional delivery.

 

They boiled jute sacks on a mud stove and placed them on a bullock cart to make a warm bed for Hingla. Musicians banged their drums around the cart. Two strong men lifted the yoke of the cart with their bare hands and ran up and down the hilly road. Everyone else followed behind. This continued until the child emerged from Hingla. As soon as they heard the baby cry, they slowed down and took the cart back into the tanda.

 

I witnessed all this despite my mother’s warnings against it. I was afraid the baby would drop through the gaps in the cart’s bamboo poles. But nothing like that happened.

 

After this incident, our folks began a new journey to sell our cattle. I spent the entire trip in the bullock cart. When they reached this tanda, they decided to marry me off to a suitable local man. They didn’t believe it was safe to take a woman of marriageable age on that long journey into unknown lands.

 

***

 

When the story ended, the storyteller continued to caress Jhamli’s head. Jhamli was so engrossed in the story that the scenes kept playing in her mind even after it was over. She seemed to forget her labor pains. When her grandmother had told her she’d been born in this traditional way, she refused to believe her. It seems she spoke the truth. And as Jhamli left her thoughts and the world of the story, her baby came into the world!

 

            Since Jhamli had called Pikni first for help, Pikni cut the baby’s umbilical cord with a flint knife and wiped the newborn with her headscarf, as is the custom. She then wrapped it around the baby. By then it was dark, and the drone of the cicadas drowned out everything. 

 

            One by one, everyone returned home. Pikni stayed with Jhamli that night.

 

***

పొద్దున్న ఎత్తాల్సిన పెండ కొట్టంలో అలాగే ఉండిపోయింది. నిద్రపోతున్న ఝమ్లికు ఇది గుర్తొచ్చి హాట్కు (సంతకు) పోయినోల్లురాకముందుకే పెండనంత ఎత్తెద్దాం అనుకుంటు బర్రెల కొట్టం ముకాన మెల్లగా నడ్సింది.  కొట్టంలో నీళ్ళ  తొట్టికి పక్కనే కాసింతదూరంలో ఉన్న ఓ రాయిపై కూసొని పెండ కప్పను గమనిస్తాంది. పెండ ఆ పాటికే బయటి వైపు ఎండిపోయింది. నల్లని గీతలుపెండ కుప్ప చుట్టు, అక్కడక్కడ కోళ్ళు మెతుకుల కోసం గీరినట్లు ఉన్నయి. అక్కడక్కడ పెండ లోంచి చిన్న చిన్న పురుగులుపాకుతున్నయి.

 

      ఉచ్చలో నానిన పాత ఎండుగడ్డి వీర్యం వాసనలా ఉంది. కొట్టంలో రేకులకు కింద అంచుల్లో రంగు రంగుల సాలీడుపురుగులు ఏలాడుతున్నాయి. ఝమ్లికి ఆ పురుగులు రంగురంగుల పూసళ్ళా అనిపిస్తున్నయి. గుడిసె పక్కనే ఉన్న ఏప సెట్టుఆకులు కాయలు అన్ని గుడిసె ముందు నిండిపోయినయి.

 

జల్ది జల్దిన అవగొట్టి తౌడుతో రొట్టెలు, రేలా పూల పప్పు చెయ్యాలి అనుకుని తన ఫేట్యాను కొంచం నడుముకు పైకి జరిపి కట్టితల పైన టూక్రిని జడ చుట్టు చుట్టేసి ఊడ కుండా కట్టి పని చాలు చేసింది.

 

 పెండ ఎత్తుతున్న ఝమ్లి తనకేదో అయినట్లు అనుకుని తన సేతులకున్న పెండను ఆ పక్కనే ఉన్న గడ్డిపై తుడ్సుకుని గుడిసెకుముందు పందిరికి కింది మంచం పై కూసొని తన ఇంటి దారి నుండి ఎళ్తున్న పిక్ణినీ పిల్సింది.

 

“ఏమైనది ఝమ్లి” అని పిక్ణి ఝమ్లితో అడ్గింది.

 

“కడుపులో నొప్పిగా ఉంది. తల తిర్గుతాంది. పురుడు దగ్గర పడినట్లు ఉంది బాయి” అంటూ పిక్ణితో ఝమ్లి నీర్సంగా సెప్పింది.

 

“పడుకో, నేనిప్పుడే అస్తా” అంటూ పిక్ణి తన సోబత్ బాయిలను పిల్సుకరానీకి పోయింది.

 

 ఆ తండాలో పెద్ద మన్షులు మోగోల్లు ఎవరూ లేరు. అందరూ హాట్కు పోయిర్రు. ఉన్న కొందరు బాయిలు పిక్ణి పిలుపుకి పందిరిదగ్గరికి చేరుకున్నరు.

      

    ఝమ్లి ఓ సేతును తన పొట్ట పై పెట్కుని ఇంకో సేతిని మంచానికి ఒక పక్కనుండి కిందికి ఏలాడదీసి

 

“యే బా…..

యే యా….

యే బాయియే మరియే…..

మన బచాడో ” అంటూ సన్నగా మూల్గుతా ఉంది.

 

పందిరి కింది నుండి మంచాన్ని ఏప సెట్టు కిందికి లేపుకొచ్చి పెట్టిర్రు.

 

         మంచానికి సుట్టు కూకున్నరు బాయిలు. నలుగురు మంచం పై పండుకొని ఉన్న ఝమ్లికి రెండు పక్కల కూసుని ఝమ్లినిఓదారుస్తూ 

 

” ఇగొ అయితది. అగొ అయితది. ఓపిక అవసరం” అంటూ సెప్తున్నరు.

     

      సూరీడు కొండల్లోకి దిగనికి ఎనకా ముందు అయితా ఉన్నడు. గుండ్రంగా మర్రి కాయల మెరుస్తున్నడు. సంతకి పోయినోళ్ళుఆపాటికే అస్తారు అని అందరూ అనుకున్నర్రు. కాని ఎవరు రాలే. అడ్వికి పోయిన బర్రెలు, ఆవులు , ఎడ్లు , గొఱ్ఱెలు ఇంకామేకలు తండా చేరుకున్నయి. పందిరి దగ్గర బాయిలు లేచి ఎవరింటికి ఆళ్లు పోయి ఎవరి మందలను వారు కొట్టాల్లో ఏసి ఝమ్లిదగ్గరికి అచ్చేసిండ్రు. ఝమ్లి బర్రెలు కొట్టంలో అరుస్తా ఉన్నయి. అది సూసిన పిక్ణి కొట్టంలోకి పోయి బర్రెలను కట్టేసి ఝమ్లి దగ్గరికిఅచ్చేసింది.

 

         సీకటి ఆకాశంల నుండి నల్ల చిమల్లా దిగుతా ఉంది. నొప్పులు తట్టుకోలేక ఝమ్లి ఏడుస్తాంటే ఆమె నొప్పులు తగ్గించనీకిపావు లోట సారా తెమ్మని చెప్పింది పిక్ణి. గుంపులోని ఓ బాయి పోయి లోటాలో సారా తెచ్చి పిక్ణికి ఇచ్చింది. పిక్ణి ఆ లోటాసారాను ఝమ్లితో తాగించింది . కొంత సేపు ఆరాం చేసినా కడుపులో నొప్పి ఆమెను సతాయించుడు మళ్ళి షురూ జేసింది.

 

   ఆమె వయసు 16 సంవత్సరాలు. ఆమె పెయ్యి కంటే ఆమె కడుపే మస్తు పెద్దగా ఉంది. కవలలు అయ్యుంటారని అందరూఅనుకున్నరు. ఆమె నొప్పి తట్టుకోలేక అరిచే అర్పులకి సుట్టు ఉన్న ఆ బాయిలు ఏడ్సుడు షురూ జేసిర్రు.

 

        కింద కూసున్న గుంపులోంచి ఒక బాయి లేచి అందరి దగ్గరి నుండి మూడు ఎంట్రుకలు తీస్కొని ఒకదగ్గర తాయిత్తులాపేని ఝమ్లి ఎడమ కాలికి కట్టి ఝమ్లి తల దగ్గర కూసుని

 

“నీకు మంచి బిడ్డ పుడ్తడు. నీకు తెలుసో లేదో పూర్వం మన పురుడు ఎట్లా అయ్యేదో. నేను నీకు ఇప్పుడు చెప్తా. నేనుచిన్నగున్నప్పుడు నా కళ్ళతో సూసినా” అంటూ హింగ్ళా కథ సెప్పుడు షురూ జేసింది. ఝమ్లి కాసేపు నొప్పులతో బాధ పడినా ఆతర్వాత కథ వినడంలో మున్గిపోయింది. ఝమ్లితో పాటు అందరూ విననీకి సిద్దమైనరు.

   

     హింగ్ళా ఎర్రగా, తేనె కను గుడ్లతో , బంగారం లెక్క మెరిసే జుట్టుతో బొమ్మలా ఉండేది. మూడు సార్లు ఆమె కడ్పులో పిండంకరిగిపోయింది.

 

 ఒకటో పారి ఆమె ఇప్పపూలను ఏరనీకి పోయినప్పుడు. నెమలి గుడ్లను సూసుకోకుండా వాటిపై కాలు పెట్టిందట. అవిపగ్లిపోయినయి.

 

రెండో పారి తను కడుపుతో ఉన్నప్పుడూ హింగ్ళా మొగుడు ఓ కుందేల్ను ఏటాడుకొని తెచ్చినాడట. దాన్ని కూర వండనీకి కోస్తే ఆకుందేలు కడుపులో పది కుందేలు పిల్లలు ఉన్నాయట. వాటిని తీసి పడేసి కూర వండినారట.

 

మూడో పారి కడుపుతో ఉన్నప్పుడు ఇంట్లోకి ఓ ఉడుము అచ్చినాదట. మన సంప్రదాయం ప్రకారం ఇంట్లోకి అచ్చిన ఉడ్మునిపట్టి దాని కాళ్ళను దాని తోకతో కట్టి ఓ కుండలో పెట్టి కుండ మూతిని తెల్లని లేదా ఎర్రని బట్టతో కట్టి ఇంటి గడపకు ముందురెండడుగులు తవ్వి పాతి పెట్టాలి. రోజు దాన్ని తొక్కుకుంటూ పోతే మన ఇంట్లో దరిద్రమంత పోతదని నమ్మకం. కాని హింగ్ళామాత్రం

 

“ఉడుము మాంసం తినాలని ఉంది”  అంటూ దాన్ని వండించుకుని తిన్నదట.

 

అలా మూడుసార్లు తన పిల్లలను తన కడుపులోనే పోగట్టుకుంది.

 

ఇదంతా జరిగిన రెండేళ్ల దాకా హింగ్ళాకు కడుపు రాలేదు. అయితే ఓ వర్షాకాలం చివరి రోజున ఓ జింక హింగ్ళా కలలోకి అచ్చి

 

“నేను సచ్చిపోతున్నాను. నా బిడ్డ నీ మేకల మందలో ఉంది. ఆకలికి నిరసించిపోయింది. దాన్ని నువ్వు జాగర్తగా చూసుకో” అని చెప్పి జింక ఓ చెట్టులా మారిపోయింది. ఆ చెట్టుకు జింక కొమ్ముల్లా కొమ్మలు మొలుస్తుంటే ఆ సప్పుడుకు నిద్ర నుండిమేల్కుని మొగుడ్ని తీస్కుని మేకల మందలోకి ఏళ్లి సూసింది. మేకలన్ని ఒక వైపు నిల్చున్నయి. జింక పిల్ల మాత్రం ఓ మూలపడిఉంది. రెండు రోజుల కింద ప్రసవించిన ఓ మేక దగ్గరికి తీసుకెళ్లి పాలు తాగించనీకి యత్నం చేసింది. కాని మేక పాలుఇవ్వకపోగా జింక పిల్లను కాలితో తన్నింది. ఇట్లా కాదనుకుని హింగ్ళా జింక పిల్లను తీస్కుని ఇంట్లోకి ఎళ్లిపోయింది. మొగుడ్నికింద పండుకోమని సెప్పింది. అతను సాప కిందేసుకుని పండుకున్నడు. హింగ్ళా ఆ జింక పిల్లను తన పక్కనే మంచం పైపడుకోబెట్టుకొని జోలాలి పాడింది. పాడుతూ పాడుతూ తన రొమ్మును జింకకు పట్టించింది. జింక రాత్రంతా పాలు తాగుతానేఉంది. హింగ్ళా పండుకుంది.

 

      తెల్లారింది. పొద్దున్న నిద్రలేచి సూస్తే తన రెండు రొమ్ముల నుండి లేత పసుపు రంగులో పాలు కారుతా ఉన్నయి. పక్కనజింక లేదు. జింక గురించి మొగుడ్ని అడిగింది.

 

“కల ఏమైనా కన్నావా” అంటూ హింగ్ళాతో అన్నాడు.

ఆశ్చర్య పోయింది. రాత్రి జరిగింది నిజమా ? అబద్దమా ? హింగ్ళాకు అర్దం కాలేదు.

కాసేపు సుట్టూ వెత్కింది. తనకు దోస్తైన ఓ బాయిని జింక గురించి అడ్గింది. అప్పుడామె

 

“నిన్న రాత్రి మూత్రం అస్తుందని నిద్రలేచి ఇంటి బైటికి అచ్చిన. అప్పుడు ఓ నక్క తండాలో తిరగడం చూసిన” అని ఆ బాయిహింగ్ళాతో సెప్పింది.

 

   “అయ్యో పిల్ల జింక నక్కకు బలైపోయిందేమో” అని కొన్ని రోజులు బాధపడింది. తర్వాత నెలకే హింగ్ళాకు కడుపొచ్చింది. ఈసారి కూడా ముందులాగే అవుతదని అందరూ అనుకున్నరు. కాని అలా ఏం కాలేదు. ఏడు నెలలకే పురిటి నొప్పులుమొదలైనయి. రెండు రోజులు ఎదురు చూసిన్రు. దాయి (మంత్రసాని) సలహా మేరకు మన సంప్రదాయ పద్ధతిలో(1980 వరకుప్రసవాలకు ఈ పద్ధతిని వాడేవారు) పురుడు పోయ్యాలని అనుకున్నరు. పోయ్యి ఎలిగించి ఉడుకుతున్న నీళ్లలో గొన సంచుల్నినానబెట్టిర్రు.

 

        ఓ ఎడ్ల బండిని తెచ్చి దాని పైన వేడి నీళ్లలో నానపెట్టిన గోన సంచుల్ని పెట్టి, దానిపై హింగ్ళాను పడుకోబెట్టిర్రు. తండాలోకొందరు డప్పు ఇనుప పళ్ళెం తీస్కుని భయంకర శబ్దాలను చెయ్యడం షురూ చేసిర్రు.

 

      ఇద్దరు పెద్దమనుషులు ఎడ్ల బండి కాడెను లేపి తమ సేతులతో పట్టుకుని ఎత్తు పల్లాలు రాళ్లు ఉన్న దారి గుండా వేగంగాపరిగెత్తుతున్నరు. తండాలోని వారందరు బండి ఎనకే ఉర్కుతున్నరు. మొత్తం మీద చానా సేపటికి ప్రసవం జరిగింది. శిశువుఏడ్పు విని బండిలోని వేగాన్ని తగ్గించి, బండిని తండా వేపు తీసుక పోయిర్రు.

 

     ” మా అమ్మ నన్ను అది సుడొద్దన్నా సూసిన, నేనైతే ఆ శిశువు బండి వెదురు బొంగుల సందులోంచి ఎక్కడ జారిపోతుందో” అనుకున్నాను.

కానీ ఏం కాలేదు.

 

ఆ తర్వాత మావాళ్ళు అక్కడి నుండి అవుల మందల్ను అమ్మనీకి వేరే ప్రాంతానికి వలస చాలు జేసిర్రు. ఆ వలసలో నేను ఎడ్లబండి దిగనే లేదు. అలా ఇటుగా మన తండాను దాటి పోతుంటే వలస ఎళ్తూ వయసుకు అచ్చిన ఆడబిడ్డను ఇలా అడవులఎంట తిప్పడం మంచిది కాదని ఈ తండాలో నాకు పెళ్ళి చేసి ఎల్లిపోయిర్రు.

 

         కథ ఖతం అయ్యింది. కథ చెప్పిన బాయి ఝమ్లి తలను నిముర్తూ ఉంది. ఝమ్లి ఆ కథ నుండి బయట పడలేదు. ఇంకాదాని గురించిన దృశ్యాలు ఆమె తలలో కదుల్తా ఉన్నయి. తను ఆ ఎడ్ల బండి పద్దతి ద్వారా పుట్టిందని తన దాది సెప్తే అది ఓకట్టు కథ అంటూ కొట్టిపారేసేది ఝమ్లి. కానీ ఇప్పుడు ఆమెకు నమ్మకం కల్గింది. తను కథ వింటూనే బిడ్డకు జన్మనిచ్చేసింది.

 

   ఝమ్లి మొదట పిక్ణిని పిలిచి సాయం అడ్గింది. కాబట్టి పిక్ణి శిశువు బొడ్డు పెగును మట్టి రంగు చేకుముకి రాయితో కత్తిరించితన తల పై నుండి కప్పుకున్న టూక్రిని తీసి బిడ్డను తుడ్సి ఆ టూక్రితో అతని పెయ్యి సుట్టు సుట్టింది. చికటైపోయింది. చుట్టూవాతావరణం కీచురాళ్ళ చప్పుళ్లతో నిండిపోయింది.

ఒక్కొక్కరిగా అందరూ తమ తమ ఇళ్లకు చేరుకున్నరు.

 

పిక్ణి మాత్రం ఆ రోజు రాత్రి ఝమ్లికి తోడుగా వాళ్ళ గుడిసెలోనే ఉండిపోయింది.

Translator's Note

This story first appeared in Dhavlo, a collection of Nayak’s short stories published in 2021. It depicts an evening when a woman goes into labor in a Banjara tribal village in the south of India, and describes Banjara childbirth customs, tinged with magical realism. The Banjaras are a nomadic tribe spread out across India with several hundred years of documented history. They retain their unique culture, language, and customs, but have also been influenced by the dominant culture in areas where they settled. Banjara women’s distinct style includes richly embroidered clothing, heavy ornaments, and thick bangles worn on both wrists.  However, their culture is rarely represented in literature.  Nayak is the first published Banjara fiction writer in Telugu. There are other Banjara writers who wrote in the Banjara language itself, or in other regional languages where they live, but primarily non-fiction. After his work got published, he met with other writers who are either Banjara themselves, or familiar with Banjara life, and the forthcoming anthology Kesula, a collection of Banjara short fiction written in Telugu, began to take shape. This short piece gives us a fascinating glimpse into Banjara childbirth customs of the past and present.


Sowmya V.B.

×

In the Classroom

×